తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.2011 అక్టోబర్15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్‌లో రైల్ రోకో కార్యక్రమం జరిగింది.అప్పట్లో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలువురు నాయకులను అరెస్టు చేశారు.ప్రస్తుతానికి ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగులో ఉంది.విచారణ సమయంలో కేసీఆర్ తరఫు న్యాయవాది, రైల్ రోకో జరిగిన సమయంలో ఆయన అక్కడ లేరని కోర్టుకు వెల్లడించారు.ఈ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం ఈ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసు ఇవ్వాలని ఆదేశించింది.తదుపరి విచారణలో మరింత స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
Previous Articleఆకట్టుకునే కంటెంట్‌తో ‘ఒక బృందావనం’…!
Next Article వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ప్రతిపక్ష కూటమి వ్యతిరేకత