భారత స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కు మళ్లీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు దక్కనున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంతో బోర్డు గతేడాది అతనికి కాంట్రాక్టు ఇవ్వకపోవడం తెలిసిందే. ఇషాన్ కిషన్ కి కూడా ఇవ్వలేదు. ఇక తిరిగి టీమ్ లో చోటు దక్కించుకున్న శ్రేయాస్ ఇటీవల జరిగిన ఐసీసీ ట్వంటీ ట్రోఫీ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 5 మ్యాచ్ లలో 243 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్ లో కూడా అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రంజీ సీజన్లో 68.57 యావరేజ్ తో 480 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 345 పరుగులు చేసి నాలుగో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. విజయ్ హాజారే ట్రోఫీలో కూడా 5 మ్యాచ్ లలో 325 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో శ్రేయాస్ కు తిరిగి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Previous Articleఆటకు వీడ్కోలు పలికిన హాకీ వెటరన్ ప్లేయర్ వందన కటారియా
Next Article ఏపీలో బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి