హాకీ ఇండియా ఉమెన్స్ వెటరన్ ప్లేయర్ వందన కటారియా ఆటకు గుడ్ బై చెప్పేసింది. 15 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో 320 మ్యాచ్ లు ఆడిన ఈ సీనియర్ ప్లేయర్ 158 గోల్స్ చేసింది. బరువైన హృదయంతో ఆటకు వీడ్కోలు చెబుతున్నా. ఫామ్ లో ఉండగానే ఆటకు స్వస్తి పలకాలని అనుకున్నా. ఎంతో కష్టపడి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగాను. భారత జెర్సీ ధరించడం ఎంతో గర్వకారణం. సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించాను. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్ను ఎప్పటికీ మరిచిపోలేను. సౌతాఫ్రికాపై హ్యాట్రిక్ చేయడం గొప్ప జ్ఞాపకం. కానీ ఒలింపిక్ పతకం సాధించకపోవడం పెద్ద వెలితి. అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికినా ఇండియా లీగ్ లో ఆడతానని వందన తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు