దేశంలోనే అత్యంత ధనికుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ గుజరాత్ లోని జామ్‌నగర్ నుండి ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. ద్వారకాధీశుడి ఆశీర్వాదం కోసమే తాను ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరం 140 కిలోమీటర్లు కాలినడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన పుట్టిన రోజు నాటికి అనంత్ ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాగా, తన కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో భారీ భద్రత మధ్య రాత్రిపూట పాదయాత్ర చేస్తున్నారు. ఇక తాజాగా తన పాదయాత్రలో అనంత్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. వందలాది కోళ్లను ఆయన రక్షించారు. కంభాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్ ను చూసిన ఆయన వెంటనే ఆ కోళ్లను విడిచిపెట్టాలని, దానికి తాను రెండు రెట్లు డబ్బులు చెల్లిస్తానని యజమానికి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జంతువుల పట్ల అనంత్ అంబానీకి ఉన్న ప్రేమను కొనియాడుతున్నారు. ఇటీవల జంతు సంరక్షణ కోసం ‘వనతార’ అనే అభయారణ్యాన్ని ఆయన నెలకొల్పిన సంగతి తెలిసిందే.
మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న అనంత్ అంబానీ… నెటిజన్ల ప్రశంసలు
By admin1 Min Read