ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ)కు నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేశారు.
475 ఎకరాల్లో, రూ.139 కోట్ల పెట్టుబడితో, 100 టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ, టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయోఎనర్జీ సీఈవో హరీంద్ర కే.త్రిపాఠితో కలిసి భూమిపూజ చేశాను. ఈ ప్లాంట్ ఏర్పాటుతో గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని లోకేష్ అన్నారు.యువతకు ఉద్యోగ కల్పనే తమ లక్ష్యమని ఈసందర్భంగా లోకేష్ పునరుద్ఘాటించారు. తెలంగాణాకు హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగుళూరు ఉంది.. మరి మీ ఆంధ్రప్రదేశ్ కు ఏముంది ? అని ఇటీవల ఢిల్లీలో తనను ఒక కార్యక్రమంలో జర్నలిస్టు ప్రశ్నించగా… ఏపీకి సీ.బీ.ఎన్ అనే బ్రాండ్ ఉందని ఆ బ్రాండ్ తోనే రాష్ట్ర రూపురేఖలు మార్చుకుంటామని తెలిపినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలిప్లాంటుకు శంకుస్థాపన చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు