రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 169-8 (20).
గుజరాత్ టైటాన్స్: 170-2 (17.5).
ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మొదటి ఓటమి ఎదురైంది. తాజాగా బెంగుళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ బెంగళూరును 169-8కి కట్టడి చేసింది. లివింగ్ స్టోన్ 54 (40; 1×4, 5×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. జితేష్ శర్మ 33 (21; 5×4, 1×6), టిమ్ డేవిడ్ 32 నాటౌట్ (18; 3×4, 2×6) పరుగులతో పర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రసీద్ కృష్ణ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్యాన్ని గుజరాత్ ఎక్కడా తడబడకుండా చేధించింది. జాస్ బట్లర్ 73 నాటౌట్ (39; 5×4, 6×6) అదరగొట్టాడు . ఇకసాయి సుదర్శన్ 49 (36; 7×4, 1×6), రూథర్ ఫర్డ్ 30 నాటౌట్ (18; 1×4, 3×6) రాణించడంతో అలవోకగా మ్యాచ్ లో విజయం సాధించింది.
Previous Articleటీటీడీపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష..!
Next Article వక్ఫ్ (సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం