అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కేసరి చాప్టర్ 2’. భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో దురదృష్టకరమైన ఘటనలలో ఒకటైన జలియన్ వాలాబాగ్ మారణహోమం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.”అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్” అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ చిత్రంలో మాధవన్, రెజీనా కసాండ్రా, అనన్య పాండే ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో హృదయ విదారక ఘట్టాలు చోటు చేసుకున్నాయి.1919లో బ్రిటిష్ పాలకుల అరాచకానికి వందలాది మంది అమాయక ప్రజలు బలైన ఘోర సంఘటన జలియన్ వాలాబాగ్ హత్యాకాండ.అయితే ఈ సినిమాలో అదే ఘటన తర్వాత భారత స్వాతంత్ర్య ఉద్యమంపై పడిన ప్రభావాన్ని,అది ప్రజల్లో కలిగించిన కోపాన్ని, తిరుగుబాటును కొత్త కోణంలో చూపించనున్నారు.అక్షయ్ కుమార్ మరోసారి దేశభక్తి ప్రధానమైన పాత్రలో కనిపించబోతుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.