మంగళగిరి నియోజకవర్గంలో మొదటి విడత లో శాశ్వత హక్కు కల్పిస్తూ 3 వేల ఇళ్ల పట్టాలు మంత్రి నారా లోకేష్ అందించారు. పేదల దశాబ్దాల కల నెరవేరిందని పేదలకు పట్టాభిషేకం ప్రారంభమైందని పేర్కొన్నారు . ఉండవల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులకు మొదటి పట్టాను లోకేష్ అందజేసారు . రాజమండ్రి గోవిందు, సీతామహాలక్ష్మి అనే దంపతులు ఇద్దరు బిడ్డలతో ఉండవల్లిలో నివాసం ఉంటున్నారు. తాము ఉంటున్న స్థలానికి పట్టా ఇప్పించాలని గతంలో వారు ఎందరో ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని అయితే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లోనే దశాబ్దాల సమస్యను పరిష్కరించామని లోకేష్ అన్నారు. ఇచ్చిన హామీ మేరకు నేరుగా వారి ఇంటికి వెళ్లి బట్టలు పెట్టి మరీ శాశ్వత ఇంటి పట్టాను అందజేసిన లోకేష్ పట్టా అందుకున్న కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం మాటల్లో వివరించలేనిదని పేర్కొన్నారు.
Previous Articleరెసిప్రోకల్ టారిఫ్స్ ప్రభావం అంతంత మాత్రమే..!
Next Article ట్రంప్ 26 శాతం సుంకాలపై స్పందించిన భారత్…!