దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను యావరేజ్ నష్టాలతో ముగించాయి. రెసిప్రోకల్ టారిఫ్స్ భయాలతో గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులలో పయనించిన సూచీలు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తరువాత ఈమాత్రం నష్టాలతో ముగియడంతో వాటి ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. అయితే చైనా, జపాన్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇక బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 322 పాయింట్ల నష్టంతో 76,295 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 23,250 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.42గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, అల్ట్రా టెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Previous Articleభారత్ లో విభిన్న వాతావరణ పరిస్థితులు….ఉత్తరాదిన పెరగనున్న ఉష్ణోగ్రతలు…దక్షిణాదిన భారీ వానలు…!
Next Article పేదల దశాబ్దాల కల నెరవేరింది: ఏపీ మంత్రి నారా లోకేష్