తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తలైవా కెరీర్లో 171వ సినిమాగా విశేషంగా నిలవబోతోంది.సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా, నాగార్జున,ఉపేంద్ర,సత్యరాజ్,శృతి హాసన్,చౌబిన్ సాహీర్ వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.లోకేష్ కనగరాజ్ – రజనీకాంత్ కాంబినేషన్లో వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.