శ్రీరామ నవమి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికీ భక్తిపూర్వక శుభాకాంక్షలు. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధు మూర్తి శ్రీరాముడు… తిరుగులేని పరాక్రమశీలి అని శ్రీమద్వాల్మీకి రామాయణం చెబుతోంది. సత్యం, ధర్మం, న్యాయం అనేవాటిని ఒక పాలకుడు ఎంత నిబద్ధతతో పాటించాలో శ్రీరామచంద్రుడి నుంచి పాలకులు గ్రహించాలి. దశరథ తనయుడు ధర్మానికి ప్రతీక కాబట్టే… త్రేతా యుగం నుంచి నేటి కలియుగంలోనూ రామ నామం వాడవాడలా మారుమోగుతూ ఉందని ఏ గొప్ప గుణం గురించి చెప్పాలన్నా.. శ్రీరాముడినే ప్రతిరూపంగా చూపిస్తుంది మన భారతీయ సమాజం. అటువంటి శ్రీరాముడి విగ్రహానికి శిరచ్చేదం చేశారు గత పాలకుల హయాంలో. ఆ దుష్ట పాలనకు ప్రజలు ఎంతో ధర్మబద్ధంగా చరమగీతం పాడారు. శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను. వాల్మీకి మహర్షి చెప్పిన రామ రాజ్య పాలన అవిష్కృతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ పర్వదినం సందర్భంగా చెప్పడం ఒక బాధ్యతగా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రామ రాజ్య పాలన అవిష్కృతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు: డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read