మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ తోనే సంచలనం సృష్టించిన ఈ చిత్రం నేడు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ‘పెద్ది ఫస్ట్ షాట్-రిలీజ్ డేట్ ‘ పేరుతో టీమ్ గ్లింప్స్ ను విడుదల చేసింది. రంగస్థలం తరువాత ఆ స్థాయి మాస్ లుక్ తో రామ్ చరణ్ అదరగొట్టారు. 90 లలో జరిగే క్రికెట్ నేపథ్యంగా సాగే కథ ఇదని ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. రామ్ చరణ్ డైలాగ్స్, లుక్స్, ఏ.ఆర్.రెహామాన్ మ్యూజిక్ ఈ గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచాయి. 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఈ వీడియోలో తెలిపారు. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా ఈచిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు