రామేశ్వరం ఐలాండ్ ను మెయిన్ లాండ్ తో కలుపుతూ నిర్మించిన మోడ్రన్ ఇంజినీరింగ్ వండర్ పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోడీ నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ఇది. సముద్రంలో 2.08 కి.మీ. పొడవు ఉండే ఈ వంతెన కింద ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో దీన్ని నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది. ఇక ఈ క్రమంలో రామేశ్వరం తాంబరం ప్రత్యేక రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇది కొత్త వంతెన మీదుగా ప్రయాణించింది. ఇక వంతెన కిందుగా ప్రయాణించిన కోస్ట్ గార్డ్ షిప్ కు పచ్చజెండా ఊపారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తమిళనాడు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన రామేశ్వరం ఆలయాన్ని సందర్శించనున్నారు.
మోడ్రన్ ఇంజినీరింగ్ మార్వెల్ ‘పంబన్ బ్రిడ్జి’ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
By admin1 Min Read