సన్ రైజర్స్ హైదరాబాద్: 152-8 (20).
గుజరాత్ టైటాన్స్: 153-3 (16.4).
సన్ రైజర్స్ హైదరాబాద్ తీరు మారలేదు. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన హైదరాబాద్ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పరుగులు చేయడంలో హైదరాబాద్ బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. నితీష్ రెడ్డి (31) టాప్ స్కోరర్. క్లాసిన్ (27), కమ్మిన్స్ 22 నాటౌట్ మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు తీశారు. ఇక టార్గెట్ ను గుజరాత్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.శుభ్ మాన్ గిల్ 61 నాటౌట్ (9×4) హాఫ్ సెంచరీతో రాణించాడు.వాషింగ్టన్ సుందర్ 49 (29; 5×4, 2×6), రూథర్ ఫర్డ్ 35 నాటౌట్ (16; 6×4, 1×6) రాణించడంతో 16.4 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఇక మొత్తంగా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లలో నాలుగు పరాజయాలతో పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో కొనసాగుతోంది.