ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్’ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024–25 సంవత్సరానికి దేశంలో రెండవ అత్యధిక వృద్ధిరేటు 8.21% తో మన రాష్ట్రం నమోదు చేసుకుందని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈమేరకు గణాంకాలను తన పోస్ట్ లో పంచుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరంగా కూడా కాలేదు, మన విధానాలు ఆంధ్రప్రదేశ్‌ను ఒక సంక్షోభ స్థితి నుంచి అభివృద్ధి మరియు నూతన నమ్మకంతో కూడిన రాష్ట్రంగా మారుస్తున్నాయని తెలిపారు. ఈ పురోగతికి అగ్రికల్చర్, మ్యానుఫాక్చరింగ్, సర్వీస్ సెక్టార్ లలో విస్తృత స్థాయి పునరుద్ధరణతో పాటు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ మరియు పునరుత్పాదక శక్తి రంగాలలో జరిగిన పెట్టుబడులు తోడ్పడ్డాయని పేర్కొన్నారు. ఇది సమిష్టి విజయమని ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.మనమంతా కలిసికట్టుగా మెరుగైన భవిష్యత్తును నిర్మించుకుందాం! అని పేర్కొన్నారు.
Andhra Pradesh is rising.
As per the latest data from @GoIStats, our state has registered the 2nd highest growth rate in the country for 2024–25, with 8.21% growth. In less than a year of forming the government, our policies have moved Andhra Pradesh from a state of distress to a… pic.twitter.com/YBkO1nEpYr— N Chandrababu Naidu (@ncbn) April 6, 2025