భారత క్రికెట్ జట్టు దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లతో మళ్లీ ఆడాలని ఉందని మరో దిగ్గజం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ధోనీ పాల్గొనగా, ఆ సందర్భంలో ఎదురైన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన పంచుకున్నారు. తన మాజీ సహాచరులంతా కలిసి ఆడితే చూడడం బాగుంటుందని పేర్కొన్నారు. 2007 టీ20 ప్రపంచ కప్ సమయంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ను ధోనీ గుర్తు చేసుకున్నారు. అప్పుడు యువరాజ్ సింగ్ బాదిన సిక్సర్లను గుర్తు చేస్తూ అందరు ఆటగాళ్లు తమ జీవితాల్లో మ్యాచ్ విన్నర్లేనని వ్యాఖ్యానించాడు. ఇక తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ రిటైర్మెంట్ లేదని స్పష్టం చేశాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు