అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఈమేరకు ఆయన ఈరోజు ఉదయం విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరారు. గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం చేస్తూనే “అడవి తల్లి బాట” కార్యక్రమానికి పెదపాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడతారు. వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్నారు . ఇక అంతకు ముందు విమానాశ్రయంలో విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన…”అడవి తల్లి బాట”కు శ్రీకారం
By admin1 Min Read