ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ధాటికి విలవిల్లాడుతున్నారు. అయితే యాపిల్ కంపెనీ టారిఫ్ ల భారం నుండి కొంత ఉపశమనం పొందేందుకు వేగంగా స్పందించింది. భారత్, చైనాలలో తయారైన ఐఫోన్లను విమానాల్లో అమెరికాకు చేరవేసింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో 5 విమానాలలో ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వస్తున్నాయి. భారత్ నుండి మూడు విమానాలు, చైనా నుండి రెండు విమానాలు ఐఫోన్లతో అమెరికా చేరుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయన్న ప్రకటన నేపథ్యంలో మార్చి నెలాఖరులో యాపిల్ యాజమాన్యం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టారిఫ్ ల భారం తగ్గించుకోవడానికి భారత్, చైనాలలోని తమ ఫ్యాక్టరీలలో తయారైన ఐఫోన్లన్నింటినీ వెంటనే అమెరికాకు చేరవేసింది. దీనివల్ల ఐఫోన్ల ధరలను మరికొంతకాలం స్థిరంగా ఉంచేందుకు యాపిల్ కంపెనీకి అవకాశం లభించిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు