బెంగాల్‌లో 25,753 మంది టీచర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని తేల్చిన కోర్టు, నియామకాలను చట్టబద్ధంగా మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ బాధిత టీచర్లతో సమావేశమయ్యారు.తాను బ్రతికినంత వరకూ ఎవరు ఉద్యోగాలు కోల్పోనీయనని ఆమె హామీ ఇచ్చారు.ఈ నిర్ణయంతో తన గుండె రాయిలా మారిందని భావోద్వేగంగా మాట్లాడారు.తన వ్యాఖ్యలపై జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు.అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.టీచర్లు న్యాయం కోసం కష్టపడొద్దని,ప్రభుత్వం వారి వెన్నుతట్టిదని భరోసా ఇచ్చారు.కొత్త నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది.ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం మళ్ళీ రేగే సూచనలు కనిపిస్తున్నాయి.
బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ రద్దుపై స్పందించిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ
By admin1 Min Read