2023-24 ఫైనాన్షియల్ ఇయర్ కు దేశంలోనే అత్యంత పెద్ద పార్టీగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ రూ. 2,243 కోట్ల విరాళాలు స్వీకరించింది. అసోసియేటెడ్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నేషనల్ పార్టీలు ఈ ఆర్థిక సంవత్సరంలో పొందిన డొనేషన్స్ వివరాలను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అత్యధిక డొనేషన్స్ పొందిన పార్టీగా నిలిచింది. అన్ని నేషనల్ పార్టీలు కలిపి మొత్తం రూ. 2,544.28 కోట్ల డొనేషన్స్ అందాయి. అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ మొత్తం రూ. 12,547 కోట్లుగా నమోదైంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చిన విరాళాలలో బీజేపీ వాటా 88 శాతంగా ఉంది. రూ. 281 కోట్ల విరాళాలతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఉన్నాయి. తమకు ఎలాంటి విరాళాలు అందలేదని బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు