హాలీవుడ్‌లో క్రేజీ ఫ్రాంచైజీగా వెలుగొందుతున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.ఈ సిరీస్‌లో 8వ భాగంగా వస్తున్న చిత్రం “మిషన్ ఇంపాజిబుల్:- ది ఫైనల్ రెకనింగ్”.టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సినిమా బృందం తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు,తమిళ ట్రైలర్లను విడుదల చేసింది.ట్రైలర్‌లో హై ఓక్టేన్ యాక్షన్ సన్నివేశాలు,థ్రిల్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చాయి.ప్రపంచాన్ని కాపాడేందుకు టామ్ క్రూజ్ పోరాడే మిషన్ మరోసారి హై లెవెల్ లో సాగనుంది.వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్టు చూపిస్తూ,విజువల్స్ ఆహా అనిపించేశాయి.ఈ మూవీని 2025లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఫైనల్ మిషన్‌గా వస్తున్న ఈ చిత్రం టామ్ క్రూజ్ కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకునేలా కనిపిస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు