ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప’ సినిమాలతో భారీ క్రేజ్ సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించనున్న కొత్త సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు అట్లీతో ఆయన కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘AA22’ చిత్ర ప్రకటన వీడియోను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అట్లీ, బన్నీ ప్రాజెక్ట్ వివరాలను వీడియోలో తెలిపారు. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ తో హీరో, డైరెక్టర్ కలవడం వంటివి ఈ వీడియోలో చూపించారు. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వివరించారు. అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా ఉండేలా తెరకెక్కించనున్నారు. పుష్ప-2 వంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ అలాగే జవాన్ వంటి సూపర్ హిట్ తర్వాత అట్లీ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇది అల్లు అర్జున్‌కు 22వ చిత్రం కాగా, అట్లీకి దర్శకుడిగా 6వ మూవీ. ఈ ప్రాజెక్టు సంబంధించి త్వరలో మిగిలిన వివరాలు రానున్నాయి.
Gear up for the Landmark Cinematic Event⚡✨#AA22xA6 – A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir #SunPictures #AA22 #A6 pic.twitter.com/MUD2hVXYDP
— Sun Pictures (@sunpictures) April 8, 2025