శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్ లో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయమైనట్లు వార్తలు వస్తున్నాయి . కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 900 ఇంజిన్లు కనిపించడం లేదంటూ కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు కంప్లైంట్ చేసింది. కియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విచారణ కోసం స్పెషల్ టీమ్ ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.
కియా పరిశ్రమకు విడి భాగాలు ఒక్కో చోటు నుండి వస్తుంటాయి. కారు ఇంజిన్లు తమిళనాడు నుండి వస్తాయి. అక్కడి నుండి వస్తుండగా మార్గమధ్యంలో చోరీ అయ్యాయా? కియా పరిశ్రమకు వచ్చాక దొంగిలించారా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసు విచారణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. త్వరలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు