సీనియర్ హీరో రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఆయనకు సరైన హిట్ పడి చాలా రోజులైంది. ‘ధమాకా’ తరువాత ఆయన నటించిన రావణసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా నిలిచాయి.ఇక ప్రస్తుతం ఆయన ‘మాస్ జాతర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గీతాంజలి మళ్లీ వచ్చింది.వివాహ భోజనంబు చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు.కాగా ఈచిత్రం నుండి ఫస్ట్ సింగిల్ పాటను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈమేరకు పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.
This is MASS MAHARAAJ ka MASS BUSTER 💥💥💥#MassJathara First Single #TuMeraLover on April 14th 🕺🏻@RaviTeja_offl & @sreeleela14 's energy will have you on your feet! 🔥🔥
A #BheemsCeciroleo Musical 🥁@BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya @vidhu_ayyanna @NavinNooli… pic.twitter.com/38a8q0VmOm
— Sithara Entertainments (@SitharaEnts) April 10, 2025