టెలికాం సంస్థలు తమ వెబ్‌సైట్లలో మొబైల్ నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌లను విడుదల చేశాయి.టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఆదేశాల మేరకు ఈ మ్యాప్‌లు పబ్లిష్ చేశారు.పారదర్శకత పెంపుతో పాటు వినియోగదారులకు తమ ఏరియాలోని నెట్‌వర్క్ స్టేటస్ తెలుసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే తమ కవరేజ్ మ్యాప్‌లను వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచాయి. కానీ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఇంకా విడుదల చేయలేదు.ఈ మ్యాప్‌లలో 2జీ, 3జీ, 4జీ, 5జీ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను రంగులతో స్పష్టంగా చూపిస్తున్నారు.జియోస్పేషియల్ డేటా ఆధారంగా యూజర్లు తమ లొకేషన్‌లో ఉన్న కవరేజ్ వివరాలను తెలుసుకోగలుగుతారు.ట్రాయ్ వెబ్‌సైట్‌లో కూడా అన్ని కంపెనీల మ్యాప్ లింకులు ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.కొత్త ప్లాన్ ఎంచుకునే ముందు ఈ మ్యాప్‌లు వినియోగదారులకు మంచి గైడెన్స్‌గా నిలవనున్నాయి.
Previous Articleరవితేజ ‘మాస్ జాతర’ నుండి ఈనెల 14న ఫస్ట్ సింగిల్
Next Article మద్యం మత్తులో రైలు పట్టాలపై కారు నడిపిన వ్యక్తి…!