నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్-3’. విజయవంతమైన ‘హిట్’ ఫ్రాంచైజీ నుండి వస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.వాల్ పోస్టర్స్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపొందుతోంది. తిపిరినేని ప్రశాంతి నిర్మిస్తున్నారు.ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. నాని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ చిత్ర ట్రైలర్ కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈనెల 14న ఉదయం 11:07 కు విడుదల చేయనున్నారు. ఇక ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని మే లో వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Blood rush on 14th.#HIT3Trailer#AbkiBaarArjunSarkaar #HIT3 pic.twitter.com/oorkA7OYOk
— Nani (@NameisNani) April 10, 2025