చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు ఊహించని షాక్ తగిలింది.ఇప్పటికే ఆ జట్టు వరుస పరాజయాలతో ఈ సీజన్ లో విఫలమవుతుంది.తాజాగా ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వడ్ ఎడమ మణికట్టు గాయం కావడంతో మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉండరని తెలుస్తుంది.గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమైనట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది.కెప్టెన్ గా ధోని నియమిస్తూ… ఆ జట్టు ప్రకటన చేసింది.ఈ మేరకు ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గురువారం ధృవీకరించారు.కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఫ్లెమింగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.గాయం కారణంగా రుతురాజ్ గైక్వడ్‌కు మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు అని తెలిపారు.ఈ క్రమంలోనే ఎంఎస్ ధోనీకి తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారని తెలిపారు.
CAPTAIN MAHENDRA SINGH DHONI 🦁7️⃣#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/H3Wqm6AdGt
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025