మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. పూలే సేవలను స్మరించుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
దేశానికి స్వాతంత్య్రం రావడానికి వందేళ్ల క్రితమే వర్ణ, కుల, లింగ వివక్షపై గళమెత్తి పోరాడి ప్రజలను చైతన్యపరచిన దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే. ఆయన స్ఫూర్తితో బీసీల అభ్యున్నతికి ఆది నుంచీ కృషిచేస్తూ బీసీల పార్టీగా పేరుగాంచింది తెలుగుదేశం. ఈరోజు మహాత్మా పూలే జయంతి సందర్భంగా ఆ అభ్యుదయవాది సామాజిక, దేశ సేవలను స్మరించుకుందాం.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహిళా అభ్యుదయం కోసం కృషిచేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నాను.