ఉత్తరాఖండ్‌లో అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రకు ఈ నెల 30వ తేదీ నుండి ఘనంగా ఆరంభం కాబోతోంది.భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు.ఈ యాత్ర ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. యమునోత్రి, గంగోత్రి ఆలయాలు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి.మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాలు భక్తుల కోసం తెరవనున్నారు.దర్శనానికి తరలివచ్చే భక్తుల కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులు యాత్రలో పాల్గొనడానికి ముందుగా ఆన్లైన్ ద్వారా తమ పేరు నమోదు చేయవచ్చు.
అంతేకాక, డెహ్రాడూన్, హరిద్వార్, గుప్తకాశి, సోన్‌ప్రయాగ్ వంటి ముఖ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం కలిపిస్తుంది.రవాణా,వసతి, వైద్య సేవల వంటి సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ యాత్ర భక్తులకు శారీరకంగా, ఆధ్యాత్మికంగా గొప్ప అనుభవాన్ని అందిస్తుందని విశ్వాసం. రాష్ట్ర ప్రభుత్వం యాత్రను సురక్షితంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్క భక్తుడు ముందస్తుగా అన్ని వివరాలు తెలుసుకొని, ఆరోగ్య పరిస్థితి బాగుండగా మాత్రమే యాత్రకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

