మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో విడాకులపై మెలిందా గేట్స్ స్పందిస్తూ,అది తాను తీసుకున్న అత్యవసర నిర్ణయమని పేర్కొన్నారు.సన్నిహిత సంబంధాల్లో విలువ ఇవ్వకపోతే విడిపోవాల్సిందేనని చెప్పారు.తమ వివాహ బంధాన్ని ముగించడం బాధాకరమైనదైనా,ఇప్పుడు జీవితం సంతోషంగా సాగుతోందని తెలిపారు.1994లో బిల్ గేట్స్, మెలిందా పెళ్లి చేసుకొని, 2021లో విడిపోయారు.జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్ గేట్స్ సంబంధాలు, ఇతర కారణాలే విడాకులకు దారితీసినట్టు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.విడాకుల తర్వాత ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు.బిల్‌గేట్స్ ప్రస్తుతం పౌలా హర్డ్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.మెలిందా కూడా జాన్ డ్యూ ప్రీతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి.గతాన్ని పక్కన పెట్టి మెలిందా తన జీవితాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
బిల్ గేట్స్‌తో విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే:- మెలిందా గేట్స్…!
By admin1 Min Read
Previous Articleవిశాఖ నుండి అమరావతికి రావాలంటే హైదరాబాద్ మీదగా రావాలా ?:-టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
Next Article ఎయిర్ ఇండియా సేవలపై అసహనం వ్యక్తం చేసిన కమెడియన్…!