భారత స్టార్ క్రికెటర్ ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్ లలో రాణించిన శ్రేయాస్ అయ్యర్ కు ఐసీసీ మార్చి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీలో 243 పరుగులతో రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించినందుకు ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. ఇక ఈ టోర్నీలో శ్రేయాస్ అయ్యర్ లీగ్ స్టేజ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 79, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ లో 45, ఫైనల్ లో న్యూజిలాండ్ పై 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఫిబ్రవరిలో కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు భారత్ కే చెందిన శుభ్ మాన్ గిల్ కే దక్కగా.. మరోసారి భారత క్రికెటర్ ఈ పురస్కారం దక్కించుకున్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు