ఏపీ గవర్నమెంట్ – సీఐఐ ఏపీ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం తొలి సమావేశంలో ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిఏడాదిలోనే రాష్ట్రప్రజలు, పరిశ్రమదారులు, అధికార యంత్రాంగం అందరి సహకారంతో ఆర్థిక వృద్ధి రేటు (జిఎస్ డిపి)లో దేశంలో 2వస్థానాన్ని సాధించగలిగామని తెలిపారు . దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అతితక్కువ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలస్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నాన్ని ఐటి హబ్ గా తయారుచేసేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని, ఐటీ రంగంలో రాబోయే అయిదేళ్లలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. తయారీ రంగంలో 30లక్షల కోట్ల పెట్టుబడులు, 5లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని వివరించారు. అమరావతి రాజధాని ఆర్థికవృద్ధి కేంద్రంగా అవతరించనుంది. అమరావతిని శక్తివంతంగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని సీఐఐ ప్రతినిధులకు ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఏపీ గవర్నమెంట్ – సీఐఐ ఏపీ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం తొలి సమావేశం… పాల్గొన్న మంత్రి లోకేష్
By admin1 Min Read