నిత్యం ప్రజా సేవ, రాజకీయాలలో బిజీగా గడుపుతూ కనిపించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు యూరప్ పర్యటనకు వెళుతున్నారు. 16వ కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. రాత్రికి విజయవాడలో ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఆయన విందును ఇవ్వనున్నారు. అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఢిల్లీ నుండి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ పర్యటనకు బయల్దేరుతారు. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు పుట్టినరోజు. ఇక ఈ పుట్టినరోజు వేడుకను అక్కడే ఘనంగా జరుపుకోబోతున్నారు. 22వ తేదీన చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. 23న ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది.
Previous Articleఏపీ గవర్నమెంట్ – సీఐఐ ఏపీ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం తొలి సమావేశం… పాల్గొన్న మంత్రి లోకేష్
Next Article ‘క్వాంటమ్ ఏఐ గ్లోబల్’తో దిల్ రాజు … కీలక ప్రకటన