పురుషుల్లో సంతానోత్పత్తి రేటు తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే మొదటి ‘స్పెర్మ్ రేస్’కి లాస్ ఏంజెల్స్ ఈ నెల 25న హోస్ట్ చేయబోతోంది. ఈ వినూత్న పోటీని ‘స్పెర్మ్ రేసింగ్’ అనే స్టార్టప్ సంస్థ నిర్వహిస్తోంది.హాలీవుడ్ పల్లాడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 1,000 మంది హాజరు కావచ్చని అంచనా. ఇందులో భాగంగా, పురుషుల వీర్య నమూనాలను స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థ ఆకృతిలో రూపొందించిన మైక్రోస్కోపిక్ ట్రాక్ పై పోటీకి తీసుకురానున్నారు.హై-రిజల్యూషన్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా వీర్యకణాల పోటీని ప్రత్యక్షంగా చూపనున్నారు. రెండు నమూనాలు 20 సెంటీమీటర్ల పొడవున్న రేస్‌ట్రాక్‌పై పోటీ పడతాయి.మానవ వీర్యం సగటున నిమిషానికి 5 మిల్లీమీటర్ల వేగంతో ఈదే గుణాన్ని ఆధారంగా ఈ పోటీ కొన్ని నిమిషాల నుంచి గంట పాటు కొనసాగనుంది. స్పెర్మ్ ఫినిష్ లైన్‌ను ముందుగా చేరితే విజేతగా ప్రకటిస్తారు. గత 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ కౌంట్ 50 శాతానికి పైగా తగ్గినట్లు నిర్వాహకులు తెలిపారు.జనాభా క్షీణతపై అవగాహన కల్పించేందుకు ఇదొక సృజనాత్మక ప్రయత్నమని టెక్, హెల్త్ వర్గాలు అభినందిస్తున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు