భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ను బీసీసీఐ తప్పించింది. బోర్డు తన నిర్ణయాన్ని ఇప్పటికే అతనికి తెలిపింది. సహాయక బృందంలో ప్రక్షాళనపై బీసీసీఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహామ్ దేశాయ్ తమ పదవుల్లో మూడేళ్లకు పైగా కొనసాగారు. కొత్త నియమావళి ప్రకారం సహాయక సిబ్బంది పదవీకాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసింది. కావున వీరిద్దరి స్థానంలో కొత్త వారిని నియమించనున్నట్లు తెలుస్తోంది.
Previous Articleసన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ గెలుపు..!
Next Article పాస్టర్‌లకు ఏపీ లోని కూటమి సర్కార్ శుభవార్త..!