ఐపీఎల్ 18 లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 40 (28; 7×4), క్లాసిన్ 37 (28; 3×4, 2×6), హెడ్ 28 (29; 3×4) పరుగులు చేశారు. ముంబై బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. విల్ జాక్స్ 2 వికెట్లు, హార్థిక్ పాండ్య, బుమ్రా, బౌల్ట్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో నే 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. బ్యాటింగ్ లోనూ విల్ జాక్స్ 36 (26; 3×4, 2×6) రాణించాడు. రికెల్టన్ (31), రోహిత్ శర్మ (26), సూర్య కుమార్ యాదవ్ (26), హార్థిక్ పాండ్య (21), తిలక్ వర్మ (21 నాటౌట్) సమిష్టిగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు, ఈషన్ మలింగా 2 వికెట్లు, హార్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.
Previous Articleక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయం..!
Next Article అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పై బీసీసీఐ వేటు..!