టాలీవుడ్లో క్లాస్ డైరెక్టర్‌గా పేరుగాంచిన శేఖర్ కమ్ముల తాజాగా మాస్ టచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘కుబేర’ సినిమా నుంచి ‘పోయిరా మామ..’ అనే తొలి పాటను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ బీట్‌కి భాస్కరభట్ల లిరిక్స్ రాయగా,హీరో ధనుష్ స్వయంగా పాడి తన టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు.పాటలో ధనుష్ వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌ను శేఖర్ వి.జె అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా చూపించింది.
అయితే ఈ పాట స్పెషాలిటీ, శేఖర్ కమ్ముల తొలిసారి మాస్ స్టెప్పులు వేసిన సందర్భం కావడం విశేషం.డైరెక్టర్ డ్యాన్స్ చేస్తుండటంతో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.శేఖర్ కమ్ముల డ్యాన్స్ చేసిన వేళ, అభిమానులలో నూతన జోష్ నిండింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానున్న ‘కుబేర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ధనుష్ ఎనర్జీ, పాట విజువల్స్ అన్నీ కలిపి ఇది ఒక మాస్ విజువల్ ట్రీట్‌గా మారింది.ప్రేక్షకుల విశేష స్పందనతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం మరింత బలపడుతోంది.