దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 855 పాయింట్లు లాభపడి 79,408 వద్ద స్థియపడగా… నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 273 పాయింట్ల లాభంతో 24,125 వద్ద స్థిరపడింది ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.38గా కొనసాగుతోంది. బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. సెన్సెక్స్ 30లో ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం కూడా మార్కెట్ కు కలిసొచ్చింది.
Previous Article‘కుబేర’ మొదటి పాటకు హ్యూజ్ రెస్పాన్స్….!
Next Article భారత్ కు మరో మెడల్…సిల్వర్ మెడల్ సాధించిన సిమ్రన్