ఏపీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు తన పేరుని లాగుతున్నారని ఏ రూపాయి తాను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో పాత్రధారి, సూత్రధారి కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని ఇటీవల మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కెసిరెడ్డే. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తానని అప్పట్లో ఆయన చెప్పారు. కాగా, తాజాగా ఈ కేసులో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
Previous Articleసూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..!
Next Article జూన్ 14న హైదరాబాద్ లో ఘనంగా ‘గద్దర్’ అవార్డుల వేడుక