ప్రముఖ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ (Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది. ఆయన ఈనెల 27న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసులలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ సంస్థల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఆ రెండు సంస్థలకు ఆయన ప్రచారకర్తగా గా ఉన్నారు. ఆయా సంస్థలకు చెందిన యాడ్ లలో నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు ఈ సంస్థలు చెల్లించిన రెమ్యునరేషన్ పై ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. మహేష్.. సాయి సూర్య ప్రాజెక్టులను ప్రచారం చేయడం వల్ల చాలా మంది ఆ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారని, అయితే ఆ సంస్థ మోసపూరిత కార్యకలాపాల గురించి ఆయనకు తెలియదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు