భారత్ కు అంతర్జాతీయ సమాజం నుండి మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవల జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత ప్రధాని మోడీకి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. అమాయక పౌరుల మృతికి కారణమైన ఈ క్రూరమైన దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన తన వ్యక్తిగత సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో ఫ్రాన్స్ భారత్‌కు, భారత ప్రజలకు అండగా నిలుస్తుందని మేక్రాన్ హామీ ఇచ్చారు. మిత్రదేశాలతో కలిసి ఉగ్రవాదంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడి పూర్తిగా అనాగరిక చర్య అని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు అందించిన మద్దతుకు, సంఘీభావానికి ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలనే భారత్ బలమైన సంకల్పంతో ఉందని మేక్రాన్ కు తెలిపారు.
భారత్ కు ఫ్రాన్స్ మద్దతు… ప్రధాని మోడీకి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫోన్
By admin1 Min Read
Previous Articleరాష్ట్రంలో స్పౌజ్ పెన్షన్ల కోసం నేటి నుండి దరఖాస్తులు స్వీకరణ
Next Article తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించిన భద్రత బలగాలు…!