అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, తన నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక కట్టడం తాజ్ మహల్‌ను కుటుంబంతో కలిసి సందర్శించారు. ఆగ్రాలోని ఈ మాన్యుమెంట్ వద్ద ఆయన తన భార్య ఉష, ముగ్గురు పిల్లలతో కలిసి ఆహ్లాదంగా గడిపారు. సుమారు గంటపాటు తాజ్ మహల్ ప్రాంగణంలో గడిపి, దాని నిర్మాణ శైలిని, సౌందర్య అనుభూతిని ఆస్వాదించారు. తాజ్ మహల్‌లోని విజిటర్స్ డైరీలో వాన్స్ తన అభిప్రాయాన్ని రాశారు. తాజ్‌ను ‘అద్భుతం’ “నిజమైన ప్రేమకు, మానవ మేధస్సుకు ఇది నిదర్శనం, భారతదేశాన్ని గొప్ప దేశమైని అభివర్ణించారు. ఈ పర్యటన అనంతరం వాన్స్ తన అనుభూతిని ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. కుటుంబంతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇది ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. అక్కడ మాకు లభించిన ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలని పేర్కొన్నారు.
తాజ్ మహల్ ను సందర్శించిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కుటుంబం… భారత ఆతిథ్యానికి ఫిదా
By admin1 Min Read

