శత్రు, బ్రహ్మాజీ, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం “కర్మణ్యే వాధికారస్తే”. నేడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. కిరీటీ అనే పాత్రలో ఆయన ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక ఈ చిత్రానికి అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డిఎస్ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ అందించారు. గ్యానీ సంగీతం సమకూర్చారు. కథ- సంభాషణలు శివకుమార్ పెళ్లూరు అందించారు. నటించగా…పృథ్వీ, శివాజీరాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఐరా దయానంద్ రెడ్డి ఈచిత్రంతో పరిచయమవుతున్నారు.
“కర్మణ్యే వాధికారస్తే” లో కిరీటీగా అలరించనున్న బ్రహ్మాజీ… పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీమ్
By admin1 Min Read