ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం సందర్భంగా మే 2వ తేదీన తలపెట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని, వాటికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. అమరావతిలో శర వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించిన ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read