గుజరాత్ టైటాన్స్: 209-4 (20).
రాజస్థాన్ రాయల్స్: 212-2 (15.5).
పరాజయాలతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ నేడు యువ ఆటగాడు వైభవ్ సూర్యవన్షీ 101 (38; 7×4, 11×6) విధ్వంసకర బ్యాటింగ్ తో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 84 (50; 5×4, 4×6), జాస్ బట్లర్ 50 నాటౌట్ (26; 3×4, 4×6) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సాయి సుదర్శన్ (39) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ తీశారు. ఇక అనంతరం లక్ష్య ఛేదనలో అతి చిన్న వయసులోనే వైభవ్ సూర్యవన్షీ 101 (38; 7×4, 11×6) గుజరాత్ టైటాన్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. యశస్వీ జైశ్వాల్ 70 నాటౌట్ (40; 9×4, 2×6), రియాన్ పరాగ్ 32 నాటౌట్ (15; 2×4,2×6) కూడా రాణించడంతో కేవలం 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా మ్యాచ్ కైవసం చేసుకుంది.
విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిన వైభవ్ సూర్యవన్షీ… గుజరాత్ పై రాజస్థాన్ భారీ విజయం
By admin1 Min Read