ఇటీవల జమ్ముకాశ్మీర్ లోని పహాల్గాంలో ఉగ్రవాద ఘటనపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది భారత ప్రభుత్వంతో పాటు ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత ఆర్మీ వైఫల్యం, చేతగానితనం కారణంగానే దాడి జరిగిందని అన్నాడు. అలాగే భారత ప్రభుత్వం తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిసారి పాక్ ను నిందించడం అలవాటుగా మారిందని నోరు పారేసుకున్నాడు. దీంతో ఆఫ్రిది వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. చాలా మంది అతని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అతని వ్యాఖ్యల పై తీవ్రంగా స్పందించాడు. ఇంకెంత దిగజారుతారు అంటూ పాక్ మాజీ క్రికెటర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోయారు. ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకెంత దిగజారుతారు. ఇలాంటి అర్ధరహిత వ్యాఖ్యలు చేసే బదులు మీ తెలివిని దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుంది అని ఆఫ్రిదికి ధావన్ చురకలంటించారు. మేము మా భారత ఆర్మీ పట్ల గర్వంగా ఉన్నాం. భారత్ మాతా కీ జై. జై హింద్ అంటూ ధావన్ ట్వీట్ చేశారు.
పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిదికి భారత మాజీ క్రికెటర్ ధావన్ స్ట్రాంగ్ కౌంటర్ ..!
By admin1 Min Read