ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ రాసిన సంపుటాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మంత్రి సత్య కుమార్ ను అభినందించారు. రాజకీయ, ప్రజా జీవితంలో ఉంటూ తాను చూసిన సత్యాలను అక్షరబద్ధం చేసి ప్రజలకు ఆ వివరాలు ‘సత్య కాలమ్’ పేరిట వ్యాసాలుగా అందించిన ఆత్మీయులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వై.సత్యకుమార్ గారికి అభినందనలు. ఇప్పటి వరకూ రాసిన 269 వ్యాసాలను రెండు సంపుటాలుగా ప్రచురించారు. ఈ వ్యాసాలను పత్రికల్లో చదివాను. సామాజిక, రాజకీయ, ఆర్థికాంశాలను విశ్లేషణాత్మకంగా రాశారని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ అధ్యయన కేంద్రం వారు ప్రచురించిన ‘ఆంధ్ర ప్రదేశ్ దిగ్దర్శనం’ పుస్తకం తననెంతో ఆకట్టుకొందని తెలిపారు. మన ఘన చరిత్రను తెలిపే కోటలు, చక్రవర్తులు, మన రాష్ట్ర ప్రముఖుల విశిష్టతను సంక్షిప్తంగా తెలియచేస్తూ రాసిన విశేషాలు ప్రతి ఒక్కరూ చదవదగ్గవి. ఆంధ్ర ప్రదేశ్ అధ్యయన కేంద్రం వారికి పవన్ అభినందనలు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు