సింహాచలం దేవస్థానంవో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలచి వేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడం తో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడి పరిస్థితి పై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షిస్తున్నానని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సింహాచలంలో గోడ కూలి క్యూ లైన్ లో ఉన్న ఏడుగురు భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను.
ఏపీ మంత్రి నారా లోకేష్:
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించాం. పోలీసులు, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు