దేశ అత్యున్నత క్రీడా అవార్డైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అందుకున్నారు. గతేడాది ఖేల్ రత్న అవార్డులకు ఎంపికైన వీరిరువురూ వేరే దేశాలలో టోర్నీలలో ఉండడంతో రాష్ట్రపతి భవన్ లో అవార్డులు తీసుకోలేక పోయారు. ఇక తాజాగా కేంద్ర క్రీడా మంత్రి మాన్ సుఖ్ మాండవీయ వీరికి అవార్డులు అందించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) కేంద్ర కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 2022 ఆసియా, కామన్ వెల్త్ గేమ్స్ లో ఈ జోడీ స్వర్ణ పతకాలు గెలుచుకుంది. 2023 ఆసియా ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా, వరల్డ్ టూర్ సూపర్ 1000లో టైటిల్ గెలుచుకున్న ఏకైక భారత ద్వయం గా ఘనత సాధించింది.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు అందుకున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి
By admin1 Min Read