ముంబై ఇండియన్స్ మరో విజయంతో సత్తా చాటింది. ఆ జట్టుకు ఇది వరుసగా 6వ గెలుపు. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. రికెల్టన్ 61 (38; 7×4, 3×6), రోహిత్ శర్మ 53 (36; 9×4) హాఫ్ సెంచరీలతో అదిరే ఆరంభానిచ్చారు. సూర్య కుమార్ యాదవ్ 48 నాటౌట్ (23; 4×3, 3×6), హార్థిక్ పాండ్య 48 (23; 6×4, 1×6) ధాటిగా ఆడడంతో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ మాత్రం 16.1 ఓవర్లలో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది. జోఫ్రా ఆర్చర్ 30 (27; 2×4, 2×6) చెప్పుకోదగిన పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 3 వికెట్లు, కర్న్ శర్మ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, హార్దిక్ పాండ్య ఒక వికెట్ తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు